skip to main |
skip to sidebar
మయమైపోతున్నడమ్మా....!
మయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు
మచ్చుకైన లేడు చూడు మానవత్వం వున్న వాడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
యాడవున్నడొ కాని కంటికి కనరాడు
మయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు
మచ్చుకైన లేడు చూడు మానవత్వం వున్న వాడు
పగరిసగ .. పగరిసగ
నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటె
చెడిపోక ఎమైతడమ్మా చెడిపోక ఎమైతడమ్మా
ఆత్మీయబంధాల ప్రేమ సంబంధాల
దిగ జారుతున్నడోయమ్మా
దిగ జారుతున్నడోయమ్మా
అవినీతి పెనుఅశ అంధకారంలోన
అవినీతి పెనుఅశ అంధకారంలోన
చిక్కిపోయి రోజు శిథిలమౌతున్నడు
మయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు
మచ్చుకైన లేడు చూడు మానవత్వం వున్న వాడు
ఇనుప రెక్కల డేగ విసిరినా పంజాకు
కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు
కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు
ఉట్టికి స్వర్గానికందకుండ తుదకు
అస్థిపంజరమయ్యి అగుపించనున్నడు
అస్థిపంజరమయ్యి అగుపించనున్నడు
కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ
కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ
కనుబొమ్మలెగరేసి కాలగమనములోన
మయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు
మచ్చుకైన లేడు చూడు మానవత్వం వున్న వాడు
దస సగగ మగస
కుక్క నక్కల దైవ రూపాలుగ కొలిచి
పంది నందిని జూస్తె పడి మొక్కుతుంటాడు
పంది నందిని జూస్తె పడి మొక్కుతుంటాడు
చీమలకు చక్కరా పాములకు పాలోసి
జీవకారుణ్యమే జీవితం అంటాడు
జీవకారుణ్యమే జీవితం అంటాడు
తోడ పుట్టిన వాళ్ళనూరవతలకి నెట్టి
తోడ పుట్టిన వాళ్ళనూరవతలకి నెట్టి
కులమంటు ఇల మీద కలహాల గిరి గీసి
మయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు
మచ్చుకైన లేడు చూడు మానవత్వం వున్న వాడు
ఇరవైఐదు పైసలగరొత్తులు కాల్చి
అరవైఐదు కోట్ల వరములడుగుతాడు
అరవైఐదు కోట్ల వరములడుగుతాడు
దైవాల పేరుతో చందాలకై దంద
భక్తి ముసుగు తొడిగి భలె పోజు పెడతాడు
ముక్తి పేరా నరుడు రక్తిలో రాజయ్యి
ముక్తి పేరా నరుడు రక్తిలో రాజయ్యి
రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు
మయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు
మచ్చుకైన లేడు చూడు మానవత్వం వున్న వాడు
అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి
చుట్టు తిరుగుతున్నడమ్మ
అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి
చుట్టు తిరుగుతున్నడమ్మ
రూపయి కొరకు ఏ పాపానికైతేమి
ఒడిగట్టె నడిగొ చూడమ్మ
కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి
కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి
కోట్లకు పరిగెట్ట కోరికలు చెలరేగి
మయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు
మచ్చుకైన లేడు చూడు మానవత్వం వున్న వాడు
మానవత్వం వున్న వాడు
మానవత్వం వున్న వాడు
చిత్రం : ఎర్ర సముద్రం (2008)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన : అందెశ్రీ
గానం : వందేమాతరం శ్రీనివాస్
No comments:
Post a Comment