Pages

Showing posts with label 7/G బృందావనం కాలని. Show all posts
Showing posts with label 7/G బృందావనం కాలని. Show all posts

Wednesday, 31 July 2013

తలచి తలచి చూస్తే





తలచి తలచి చూస్తే
తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటిని
ఓ ఓ నీలో నన్ను చూసుకొంటిని
తెరచి చూసే చదువు వేళ కాలిపోయే లేఖ రాసా
నీకై నేను బ్రతికి ఉంటిని ఓ ఓ
నీలో నన్ను చూసుకొంటిని

కొలువు తీరు తనువుల నీడ
చెప్పు కొనుడు మన కధనెపుడు
రాలిపోయిన పూల గంథమా

రాక తెలుపు మువ్వల సడిని
తలచుకొనును దారులు ఎపుడు
పగిలిపోయిన గాజుల అందమా ఆ

అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత
ఒడిలొ వాలి కధలను చెప్ప రాసి పెట్టలేదు
తొలి స్వప్నం చాలులే ప్రియతమా కనులూ తెరువుమా

మధురమైన మాటలు ఎన్నో
కలసిపోవు నీ పలుకులలొ
జగము కరుగు రూపే తరుగునా

చెరిగిపోని చూపులు అన్ని
రేయి పగలు నిలుచును నీలో
నీదు చూపు నన్ను మరచునా

వెంటవచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు
కళ్ళ ముందు సాక్ష్యాలున్న తిరిగి నేను వస్తా
ఒకసారి కాదురా ప్రియతమా ఎపుడు పిలిచినా

తలచి తలచి చూస్తే
తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటిని
ఓ ఓ నీలో నన్ను చూసుకొంటిని